అచ్చి రావడం
మొన్నటి అమెరికా ఆన్ లైన్ పత్రిక 'కౌముది' లో బూరుగు గోపీ కార్టూన్ వేశాడు--'ఒకవేళ పొరపాటున నేను చావలేదనుకో, నేను కట్టిన ప్రీమియం డబ్బంతా దండగన్నట్టే కదా?' అంటూ!
మాకు తెలిసిన ఒకాయన వున్నాడు. ఆయన 'ఇన్స్యూరెన్స్' మాటెత్తితే చాలు--మాకొద్దండీ--అది మాకు అచ్చిరాలేదు! అంటాడు.
మరి ఆయన వుద్దేశ్యం లో 'అచ్చి రావడం' అంటే యేమిటో!
వుదాహరణకి, మూడో నాలుగో ప్రీమియాలు కట్టాక చేసినవాడు పోయాడనుకోండి, పూర్తి ఇన్స్యూరెన్స్ సొమ్ము వచ్చేస్తుంది కదా? అప్పుడు అచ్చి వచ్చినట్టే కదా?
లేదూ--ఓ ముఫై నలభై యేళ్ళు ప్రీమియం కడుతూనే వుంటే, ఇన్స్యూర్డ్ మొత్తం కన్నా యెక్కువ ప్రీమియం చెల్లించాడనుకోండి, ప్రీమియం డబ్బు దండగైనా, అన్నాళ్ళూ బ్రతికే వున్నాడు అంటే, అదీ అచ్చి వచ్చినట్టే కదా?
అహా! ఇలాంటివాళ్ళు కూడా వుంటారన్నమాట అనిపిస్తుంది!
No comments:
Post a Comment