కన్నీటి వరద
మంత్రాలయం, కర్నూలు, నంద్యాల, గుంటూరు కృష్ణా జిల్లాలు పూర్తిగా వరద బారి పడ్డాక, మొదటి నాలుగు రోజులూ బాధితులైన వారికి అందిన సహాయం అంతంత మాత్రమే!
ఆ తరవాత, వెల్లువలా లారీలకి లారీలు--బియ్యం, పప్పులూ వుప్పులూ, బట్టలూ, కంచాలూ-గ్లాసులూ, మందులూ--ముఖ్యం గా మంచినీళ్ళ పాకెట్లూ/పీపాలూ వెళుతున్నాయి--రోజూ!
కానీ వాటిని క్రమబధ్ధం గా స్వీకరించి, సద్వినియోగం చెయ్యడం జరగడం లేదు!
ఇక ప్రభుత్వ సహాయమైతే, ఓ వెయ్యి నొక్కేసి, దానికి యెవరు వొప్పుకుంటే వాళ్ళకి--అసలు వరద ముఖమే చూడనివారికీ, పెద్ద పెద్ద మేడల్లో వుండేవాళ్ళకీ--చీటీలు వ్రాసి అందజేస్తున్నారట--స్థానిక రాజకీయులు!
మరి సహాయం పంపించేవాళ్ళు--అక్కడి అధికారులతో సమన్వయం చేసుకొని, వీళ్ళు పంపినవి వాళ్ళు స్వీకరించేలా యెందుకు చెయ్యలేకపోతున్నారు? అవి రాజకీయుల ఇళ్ళల్లోకీ, మిల్లుల్లోకీ, గోదాముల్లోకీ యెందుకు చేరుతున్నాయి? అక్కణ్ణించి మళ్ళీ యెందుకు అమ్మబడుతున్నాయి?
ఇవన్నీ చేసేవాళ్ళకి నిష్కృతి వుంటుందా?
వాళ్ళని దగ్గర్లోని దీప స్థంభానికో, పోలీసు స్టేషన్ కిటికీకో వురి తీస్తే తప్పేముంటుంది?
అలెగ్జాండరు ఖాళీ చేతుల్ని గుర్తు తెచ్చుకుంటే ఇలాంటివి చెయ్యగలరా?
యేమో మరి!
No comments:
Post a Comment