Sunday, May 31, 2009

Oil Prices & Profits

Of late, the Oil Companies in India are crying wolf about the subsidies/prices and losses on Petrol, Gas, Diesel, Kerosene, Naphta etc.!

Now the cat is out of the bag--they have declared huge profits for the last quarter of the previous financial year!

But now the Government says, it will decontrol the prices of the oil and oil products!

To help whom?

It says it will interfere only when the rate per barrel of crude crosses a certain level!

If it remains just below the level, and the oil companies go on raising their prices, what is the fate of consumers and the economy?

G O K!

Tuesday, May 26, 2009

‘ఉతూతి…..’

నిన్న అనుకున్నట్టు 4 కోట్లు కాదట—రాష్ట్ర వ్యాప్తంగా 40 శాఖల ద్వారా సుమారు 15 వేల మంది నుంచి—7 కోట్లవరకూ యెత్తుకుపోయినట్టు పోలీసు దర్యాప్తులో తేలిందట!

విజయవాడ ప్రథాన కేంద్రం గా, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, విసాఖపట్నం, విజయనగరం, గుంటూరు వంటి ప్రముఖ నగరాలతోపాటు సమీప పట్టణాలలో కూడా మహిళలూ, నిరుపేదలూ, సామాన్యుల నించి వసూళ్ళు చేసి ముంచిందట!

దీన్ని ఈనాడు—ఈ టీవీ బయటపెట్టింది!

వుండవిల్లి అరుణ్ కుమారూ! యేమి చేస్తున్నావు? ముథూట్, మణుప్పురం—ఇలాంటివి కూడా నీకు కనిపించడం లేదా?

అసలు అన్నవరం లాంటి బోగస్ సంస్థల్ని పెంచి పోషిస్తున్న ‘మహిళలూ, నిరుపేదలూ, సామాన్యులూ’ ఇలా యెందుకు చేస్తున్నారు?

కొంత ‘సులభ నగదు’ (ఈజీ మనీ) సంపాదించి, దాన్ని మరింత సులభ నగదు ద్వారా పిల్లలు పుట్టించి, పెంచుకోవాలని! (యెవరన్నారు భారత్ పేద దేశమని?)

ద్రవ్యోల్బణం యెందుకు వస్తోందో తెలుస్తోందా? (ప్రభుత్వ లెక్కల్లో కాదు—ప్రజల ఇక్కట్లలో)

పోయిన ఎలక్షన్ల పుణ్యమాని, ప్రతీ అభ్యర్థీ పరిమితికి లోబడే ఖర్చు పెట్టినా, కొన్ని వందల కోట్లు ప్రజలకి పంచిపెట్టబడింది—ఇది కేవలం చట్టబద్ధంగా! ఇక చట్టవిరుద్ధం గా సంగతి మనం మాట్లాడుకోనఖ్ఖర్లేదు!

తుమ్మల కిషోర్ అంటాడూ—బ్యాంకులు ఒకదాంట్లో ఒకటి విలీనమైపోయి, బ్యాంకుల్లో ప్రభుత్వ పెట్టుబళ్ళు 51 శాతం కన్న బాగా (యే 29 శాతానికో) తగ్గిపోయి, పబ్లిక్, ప్రైవేటు విడుదలల ద్వారా మరిన్ని లక్షల కోట్లు సేకరించి, అతి తక్కువ వడ్డీకి అందరికీ అప్పులిచ్చేస్తే బాగుంటుంది—అని! (ఆ మొహమాటం యెందుకు? వడ్డీ లేకుండా అంటే ఇంకా బాగుంటుందికదా!) అన్నట్టు, ఈయనకి వ్యాసం తరవాత ఇన్నాళ్ళూ లేని ఓ తోక తగిలించారు—‘రచయిత బ్యాంకింగు రంగం లో నిపుణుడు’—అని!

నిజం రామోజీరావుకీ, మీకే తెలియాలి మరి!

Monday, May 25, 2009

‘ఉతూతి…….!’

నేనంటూనే వున్నానుగా—ఉతూతి ఫైనాన్స్ లు పెరిగి పోయాయని!
అరవ్వాళ్ళు అన్నీ ‘తిరపతి’ కి సంబంధించిన పేర్లు (గోవిందా ఎంటర్ప్రైజెస్ లాంటివి), యెన్నుకుంటే మన తెలుగు వాళ్ళు ‘అన్నవరం’ యెన్నుకున్నారు!

బొండాడ మాణిక్యాలరావు విజయవాడ లోని అన్నవరం అగర్ బత్తీ సంస్థ తరుఫున, 5 వేలు, అంతకు మించి డిపాజిట్ చేస్తే, నెల నెలా వడ్డీ తో పాటు ఉపాధి కూడా కల్పిస్తామన్నాడట.
కొంతకాలం అగర్ బత్తీలూ, ప్యాకింగ్ సామాగ్రి ఇచ్చి, ప్యాకింగ్ చేసిన పెట్టెలని తీసుకొని, కూలి ముట్ట చెప్పేవాడట. తీరా నెల వడ్డీ అడిగితే, రేపు, మాపు అని తిప్పాడట!

వాళ్ళు వసూలు చేసిందెంతో తెలుసా? భీమవరం చుట్టుపక్కలా, జిల్లా మొత్తం మీదా—షుమారు ‘నాలుగు కోట్లు!’

ఈనాడుకి అనుమానమొచ్చి బయటపెడితే, ఆడాళ్ళు వాడిని బాదెయ్యబోతే, పోలీసులు వెంటనే అరెష్టు చేశారట! (నేరస్తుల్ని పట్టుకోమంటే ఆలస్యం చేస్తారుగానీ మన పోలీసులు, నేరగాళ్ళని ఆదుకోడానికి లిప్తపాటు కూడా ఆలస్యం చెయ్యరు!—దకా!)

మరి ఇవాళ ‘మణుప్పురం’ 14% వడ్డీకి బంగారం మీద గ్రాముకి ఇచ్చేదెంతో తెలుసా?
అక్షరాలా 1363 రూపాయలు!

మరి వీళ్ళకెంతమంది బలౌతారో!

Thursday, May 21, 2009

తాజా వార్త

……….యేమిటంటే, మన కళైఙ్గర్ ‘మీ మంత్రివర్గం లో మేము చేరం పొండి’ అని చెప్పేశాడుట! (తను అడిగినన్ని మంత్రి పదవులు ఇవ్వలేమన్నారు కాబట్టి—అని పండితుల విశ్లేషణ!)

పాపం ఆంధ్రావాళ్ళు క్రితంసారి తొంబలుగా ఎంపీలని గెలిపించినా, ఒక్క కేబినెట్ మంత్రి పదవీ ఇవ్వలేదు, ఈ సారైనా ఒకటో రెండో ఇవ్వకపోతే, రాశ్శేఖర్రెడ్డి రాష్ట్ర ప్రజలకి ముఖం చూపించలేడు—మూడోసారి నెగ్గడం అనుమానమైపోతుందేమో అని సోనియా, “కరుణాజీ, మీరడిగిన ‘తొమ్మిది’ కాదు, మరో మాట చెప్పండి” అని అడిగి వుంటుంది.

మరి తమిళ ఆత్మగౌరవం యేమవ్వాలి? “ఇస్తే తొమ్మిదీ ఇవ్వండి, మేమడిగినవే ఇవ్వండి—లేకపోతే లేదు” అని తెగేసి చెప్పి, “మేమసలు మంత్రివర్గం లో చేరం!” అని ప్రకటించేశాడు కరుణ!

చూద్దాం, ఈ బింకాలు యెన్ని గంటలపాటు వుంటాయో!

మన రాశ్శేఖర్రెడ్డి యెంతవరకూ ‘ఆత్మగౌరవాన్ని’ నిలబెట్టుకొని, తెలుగువాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెడతాడో!

సెన్సెక్స్ ఓ పెరిగిపోతోంది! మళ్ళీ ‘రియల్’ బూ ం (మన రాష్ట్రం లో) వచ్చినా రావచ్చు! భూములెలాగూ మిగల్లేదు, అసెంబ్లీ హాలూ, జూబిలీ హాలూ, రవీంద్ర భారతి, హుస్సేన్ సాగరూ, పబ్లిక్ గార్డెన్సూ అయినా మిగులుతాయో, పందేరం చేసేస్తారో! చూడాలి!

యేమైనా, మన ‘చిరు’ చేసింది చిరు తప్పిదం కాదనీ, ‘చారిత్రాత్మక తప్పిదం’ అనీ అనిపించడం లేదూ?

మన జేపీ మరో ‘లోక్ నాయక్’ అయితే యెంత బాగుండును!—అనిపించడంలేదూ?

ఆలోచించండి!