Tuesday, May 26, 2009

‘ఉతూతి…..’

నిన్న అనుకున్నట్టు 4 కోట్లు కాదట—రాష్ట్ర వ్యాప్తంగా 40 శాఖల ద్వారా సుమారు 15 వేల మంది నుంచి—7 కోట్లవరకూ యెత్తుకుపోయినట్టు పోలీసు దర్యాప్తులో తేలిందట!

విజయవాడ ప్రథాన కేంద్రం గా, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, విసాఖపట్నం, విజయనగరం, గుంటూరు వంటి ప్రముఖ నగరాలతోపాటు సమీప పట్టణాలలో కూడా మహిళలూ, నిరుపేదలూ, సామాన్యుల నించి వసూళ్ళు చేసి ముంచిందట!

దీన్ని ఈనాడు—ఈ టీవీ బయటపెట్టింది!

వుండవిల్లి అరుణ్ కుమారూ! యేమి చేస్తున్నావు? ముథూట్, మణుప్పురం—ఇలాంటివి కూడా నీకు కనిపించడం లేదా?

అసలు అన్నవరం లాంటి బోగస్ సంస్థల్ని పెంచి పోషిస్తున్న ‘మహిళలూ, నిరుపేదలూ, సామాన్యులూ’ ఇలా యెందుకు చేస్తున్నారు?

కొంత ‘సులభ నగదు’ (ఈజీ మనీ) సంపాదించి, దాన్ని మరింత సులభ నగదు ద్వారా పిల్లలు పుట్టించి, పెంచుకోవాలని! (యెవరన్నారు భారత్ పేద దేశమని?)

ద్రవ్యోల్బణం యెందుకు వస్తోందో తెలుస్తోందా? (ప్రభుత్వ లెక్కల్లో కాదు—ప్రజల ఇక్కట్లలో)

పోయిన ఎలక్షన్ల పుణ్యమాని, ప్రతీ అభ్యర్థీ పరిమితికి లోబడే ఖర్చు పెట్టినా, కొన్ని వందల కోట్లు ప్రజలకి పంచిపెట్టబడింది—ఇది కేవలం చట్టబద్ధంగా! ఇక చట్టవిరుద్ధం గా సంగతి మనం మాట్లాడుకోనఖ్ఖర్లేదు!

తుమ్మల కిషోర్ అంటాడూ—బ్యాంకులు ఒకదాంట్లో ఒకటి విలీనమైపోయి, బ్యాంకుల్లో ప్రభుత్వ పెట్టుబళ్ళు 51 శాతం కన్న బాగా (యే 29 శాతానికో) తగ్గిపోయి, పబ్లిక్, ప్రైవేటు విడుదలల ద్వారా మరిన్ని లక్షల కోట్లు సేకరించి, అతి తక్కువ వడ్డీకి అందరికీ అప్పులిచ్చేస్తే బాగుంటుంది—అని! (ఆ మొహమాటం యెందుకు? వడ్డీ లేకుండా అంటే ఇంకా బాగుంటుందికదా!) అన్నట్టు, ఈయనకి వ్యాసం తరవాత ఇన్నాళ్ళూ లేని ఓ తోక తగిలించారు—‘రచయిత బ్యాంకింగు రంగం లో నిపుణుడు’—అని!

నిజం రామోజీరావుకీ, మీకే తెలియాలి మరి!

No comments: