మందమైన చర్మం
'............గల ఆర్గనైజేషన్ లు యేవి అని అడిగితే......'
'నాకుమాత్రం మొట్టమొదట గుర్తొచ్చేది 'జీవన్ బీమా నిగమ్' అని వ్రాశాను కానీ, మొదట మన 'బీ ఎస్ ఎన్ ఎల్' గురించే ముందుగా వ్రాద్దామనిపించింది.
ది గ్రేట్ 'ఇండియన్ పోస్ట్ స్ అండ్ టెలెగ్రాఫ్స్' అనే ప్రభుత్వరంగ సంస్థ చక్కగా పని చేసేది. కొన్ని లక్షల మంది వుద్యోగులు పనిచేసేవారు. గుర్రాలపై, గాడిదలపై, యేనుగుల పై, జడల బర్రెలపై కూడా వుత్తరాలని అందించేవారు.
'కట్ట కడ కట్ట కడకట్ట కట్ట' ఇలా టెలిగ్రాం ని ప్రసారం చెయ్యడం ఒక కళ!
కొన్నివేలమంది టెలిఫోన్ ఆపరేటర్లు--లోకల్ కాల్స్, ట్రంక్ కాల్స్, అర్జెంట్ కాల్స్, ఎక్స్ ప్రెస్ ట్రంక్ కాల్స్, లైటెనింగ్ కాల్స్--కనెక్టు చేస్తూ, రాత్రింబగళ్ళు నైపుణ్యం గా అవధానాలు చేసేవారు!
మన భారత ప్రభుత్వం నిర్వాకం వల్ల, ఇవన్నీ పూర్వ వైభవాలుగా మిగిలిపోయి, ముక్కలు ముక్కలై, ప్రతీ సంస్థా 'యెవరికి పుట్టిన బిడ్డరా? వెక్కి వెక్కి యేడిచింది?' అన్నట్టు తయారయ్యాయి--ఇప్పటి సంస్థలు.
...........మళ్ళీ ఇంకోసారి.
2 comments:
మాకు తెలీని విషయాలు చెపుతున్నారు బాగుంది.
ఇప్పుడెందుకు వాటిని తిడుతున్నారు?
అవి బాగానే వున్నట్టున్నాయే.
డియర్ Ekalavya!
'....బాగానే వున్నట్టున్నాయే' అనే ప్రశ్నలోనే లేదూ సమాధానం?
నిన్ననే ప్రచురితమైన వార్త 'బీ ఎస్ ఎన్ ఎల్ మొదటిసారి నష్టాల్లోకి వచ్చింది ' ట.
ఇక తిట్టడం విషయానికొస్తే, వాటిలో బ్యూరాక్రసీ ని, 'హిప్పో(పోటమసో)క్రసీ', 'దున్నపోతోక్రసీ', 'పందోక్రసీ', 'ఖడ్గమృగోక్రసీ', అదేదో 'సారర్-రెక్సోక్రసీ'....ఇలాంటి మాటలు కూడా చాలవనిపిస్తుంది!
నా టపాలు చదువుతూ వుండండి.
(అన్నట్టు మీ వాళ్ళెవరూ ఆ సంస్థల్లో వుద్యోగం చెయ్యడం లేదు కదా?)
ధన్యవాదాలు.
Post a Comment