Friday, April 16, 2010

బ్యూరాక్రసీ

మందమైన చర్మం

'............గల ఆర్గనైజేషన్ లు యేవి అని అడిగితే......'

'నాకుమాత్రం మొట్టమొదట గుర్తొచ్చేది 'జీవన్ బీమా నిగమ్' అని వ్రాశాను కానీ, మొదట మన 'బీ ఎస్ ఎన్ ఎల్' గురించే ముందుగా వ్రాద్దామనిపించింది.

ది గ్రేట్ 'ఇండియన్ పోస్ట్ స్  అండ్ టెలెగ్రాఫ్స్' అనే ప్రభుత్వరంగ సంస్థ చక్కగా పని చేసేది. కొన్ని లక్షల మంది వుద్యోగులు పనిచేసేవారు. గుర్రాలపై, గాడిదలపై, యేనుగుల పై, జడల బర్రెలపై కూడా వుత్తరాలని అందించేవారు. 

'కట్ట కడ కట్ట కడకట్ట కట్ట' ఇలా టెలిగ్రాం ని ప్రసారం చెయ్యడం ఒక కళ!

కొన్నివేలమంది టెలిఫోన్ ఆపరేటర్లు--లోకల్ కాల్స్, ట్రంక్ కాల్స్, అర్జెంట్ కాల్స్, ఎక్స్ ప్రెస్ ట్రంక్ కాల్స్, లైటెనింగ్ కాల్స్--కనెక్టు చేస్తూ, రాత్రింబగళ్ళు నైపుణ్యం గా అవధానాలు చేసేవారు!

మన భారత ప్రభుత్వం నిర్వాకం వల్ల, ఇవన్నీ పూర్వ వైభవాలుగా మిగిలిపోయి, ముక్కలు ముక్కలై, ప్రతీ సంస్థా 'యెవరికి పుట్టిన బిడ్డరా? వెక్కి వెక్కి యేడిచింది?' అన్నట్టు తయారయ్యాయి--ఇప్పటి సంస్థలు. 

...........మళ్ళీ ఇంకోసారి.

Monday, March 8, 2010

భారీ......

తెల్ల యేనుగులు

వీటిగురించి ఓ టపాలో వ్రాశాను--వివరణ మరోసారి ఇస్తాను అని.

వీటిలో, 'విజిలెన్స్ కమిషన్ ' ఒకటి (స్టేట్ అయినా, సెంట్రల్ అయినా).

ప్రభుత్వం లో పై అధికారులు/రాజకీయులు గాని, సంస్థల్లో యాజమాన్యాలుగానీ, యేదైనా కుంభకోణమో, ప్రమాదమో జరిగినప్పుడు, యెవరిని బలిపశువులుగా శిలువ వెయ్యాలో ముందే నిర్ణయించుకుని, అప్పుడు విజిలెన్స్ వాళ్ళకి అప్పగిస్తారు.

ఇక అక్కడనించి, యెక్కడలేని రూల్సూ, జీవోలూ, నిబంధనలూ, వివరణలూ అన్నీ నిందితుడిమీద ప్రయోగిస్తారు. అక్కడతో వాడు హరీమంటాడు.

వుదాహరణకి, మొన్నామధ్య 'బోగస్ పట్టాదారు పాస్ పుస్తకాలతో' బ్యాంకులని మోసగించిన కేసులు ఓ జిల్లా మొత్తం మీద కొన్ని వందలు వెలుగు చూశాయి.

ఇప్పుడు విజిలెన్స్ వారు, 'బ్యాంకు అధికారులదే తప్పు--యెందుకంటే, ఆ పొలం వాళ్ళదే అని నిర్ధారణ అయ్యాక, దాని కొలతలు, వేస్తున్న పంట, మొదలైనవన్నీ తణిఖీ చేసి, అప్పుడు మాత్రమే అప్పు ఇవ్వాలి!' అని నిర్ధారించేశారుట.

అసలు ఫోర్జరీలు చేసినవాళ్ళు, తెలిసీ దొంగ పుస్తకాలని తయారు చేసి అమ్ముకున్నవాళ్ళూ, దళారులూ అందరూ బాగానే వుంటారు--మధ్య బ్యాంకు అధికారులు బలి పశువులు.

ఒక బ్యాంకు శాఖలో కొన్ని వేల పంట ఋణాలు వుంటాయి--వాటిలో వివిధ మండలాలూ, గ్రామాలకి చెందిన రైతులూ, భూములూ వుంటాయి. కనాకష్టం గా ఓ రెండువందలే ఋణాలు వున్నాయనుకున్నా, చిన్నా, సన్నకారు రైతులూ, పెద్ద రైతులూ అందరి కమతాలూ లెఖ్ఖలోకి తీసుకుంటే సగటున రెండు నించి మూడు హెక్టార్లు వుంటాయి. అంటే మొత్తం రెండువందల ఋణాలకీ కలిపి వెయ్యి యెకరాల నించి 1500 యెకరాల మధ్య వుంటాయనుకుంటే, ఆ శాఖ వ్యవసాయాధికారి అంత భూమిని, అన్ని వూళ్ళలో చుట్టివచ్చి, 'నిర్థారణలు ' చేసుకున్న తరవాతే అప్పు ఇవ్వాలంటే, జరిగే పనేనా?

మరి రెవెన్యూ వాళ్ళు సర్టిఫికెట్లూ, అడంగళ్ళూ అవీ జారీ చెయ్యడం యెందుకు?

'పృష్టతాడనాత్ దంత భఙ్గః' అంటే ఇదేనేమో!

Sunday, February 28, 2010

విభజించి.............

రాజకీయం

బొచ్చె చేపల సచ్చినోడు 'తెలంగాణా ఇస్తే తప్పేమిటి?' అన్నాడట.

వీడు రాశ్శేఖర్రెడ్డి శిష్యుడిగా కోట్లు సంపాదించుకున్నాడు--వాడికి వీర విథేయుడు. 

ఇప్పుడు రోశయ్యక్కూడా వీర విథేయుడు (అనుకుంటారు చాలా మంది).

వీడి అసలు రాజకీయం యేమిటి? యెవరు వీడిచేత ఈ మాటలు పలికించారు?

అదీ ఓ ట్రిలియన్ రూపాయల ప్రశ్న!

Thursday, February 25, 2010

జీవితబీమా

అచ్చి రావడం

మొన్నటి అమెరికా ఆన్ లైన్ పత్రిక 'కౌముది' లో బూరుగు గోపీ కార్టూన్ వేశాడు--'ఒకవేళ పొరపాటున నేను చావలేదనుకో, నేను కట్టిన ప్రీమియం డబ్బంతా దండగన్నట్టే కదా?' అంటూ!

మాకు తెలిసిన ఒకాయన వున్నాడు. ఆయన 'ఇన్స్యూరెన్స్' మాటెత్తితే చాలు--మాకొద్దండీ--అది మాకు అచ్చిరాలేదు! అంటాడు.

మరి ఆయన వుద్దేశ్యం లో 'అచ్చి రావడం' అంటే యేమిటో!

వుదాహరణకి, మూడో నాలుగో ప్రీమియాలు కట్టాక చేసినవాడు పోయాడనుకోండి, పూర్తి ఇన్స్యూరెన్స్ సొమ్ము వచ్చేస్తుంది కదా? అప్పుడు అచ్చి వచ్చినట్టే కదా?

లేదూ--ఓ ముఫై నలభై యేళ్ళు ప్రీమియం కడుతూనే వుంటే, ఇన్స్యూర్డ్ మొత్తం కన్నా యెక్కువ ప్రీమియం చెల్లించాడనుకోండి, ప్రీమియం డబ్బు దండగైనా, అన్నాళ్ళూ బ్రతికే వున్నాడు అంటే, అదీ అచ్చి వచ్చినట్టే కదా?

అహా! ఇలాంటివాళ్ళు కూడా వుంటారన్నమాట అనిపిస్తుంది!

Friday, January 15, 2010

నాలుగో జమీ


వాక్ స్వాతంత్ర్యం


ఈ మధ్య మీడియాలో వినిపించిన మాటలు 'ఎక్సైల్డ్'; 'రిలయన్స్ '; 'ద్రౌపది ' 'స్వయం నియంత్రణ' ఇలా చాలా!  


అమెరికా రాజ్యాంగానికి చేసిన మొట్టమొదటి సవరణ ద్వారా వాక్ స్వాతంత్ర్యం ప్రకటించబడి, 'నాలుగో జమీ' (ఫోర్త్ ఎస్టేట్ ని తెలుగులో ఇలా అంటే బాగుంటుందని వాడాను) వాడుకలోకి వచ్చింది అంటారు.  


ఏ ప్రభుత్వానికైనా మూల స్థంభాలైన--చట్ట వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ తరవాత--నాలుగో స్థంభం గా దీన్ని గుర్తించారు ప్రపంచ వ్యాప్తంగా.  


మరి యే ప్రభుత్వమైనా ఈ వాక్ స్వాతంత్ర్యాన్ని పరిహరించదలుచుకుంటే? ప్రజలందరూ తిరగబడాలి--దాన్ని కాపాడుకోవాలి!  


మరి ఈ రాజకీయులు--'నియంత్రణ వుండాలి; ఆంక్షలు విధించాలి'అని యెందుకు అరుస్తున్నట్టు? ఒకసారి ఆంక్షలు అంటూ మొదలైతే, యెప్పటికైనా దాన్ని పూర్తిగా హరించకపోతామా, అప్పుడు మనమేమి చేసినా చెల్లుతుంది--అని వీళ్ళ ఆశ.  


తస్లీమా వ్రాసిన 'లజ్జ' లో యేమి వుందో అని ఆసక్తిగా కొని చదివాను--అది నవలా కాదు, కథా కాదు, వ్యాసం కాదు--మరేదో! అందులో బంగ్లాదేశ్ లో 'ఫలానా రోజు ఫలానా వూళ్ళలో ఇన్ని హిందూ ఆలయాల్ని ధ్వంసం చేశారు, ఇంతమంది హిందువులు చనిపోయారు' అంటూ యేకరువు పెట్టింది--అందుకే ఆ ప్రభుత్వానికి అది నచ్చలేదు--ఫత్వా జారీ అయ్యింది!  


ఇక అందుకే, సల్మాన్ రష్డీ తన శాటానిక్ వెర్సెస్ లో యేమి వ్రాశాడొ చదవలేదు నేను!  


మళ్ళీ డా విన్సీ కోడ్ కొనకపోయినా, మా అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడు కనపడితే, చదివాను--డా విన్సీ బొమ్మని చక్కగా 'ఇంటర్ప్రెట్' చేసి, చక్కని నవల వ్రాశాడు--అవన్నీ నిజాలే అనిపించేంతగా! 


తమకి చేతనైతే ఆ విషయాలూ, ఇచ్చిన ఉదాహరణలూ తప్పని నిరూపించాలిగానీ, దాన్ని యెవరూ చదవడానికి వీల్లేదు అంటే?  


ఇక ద్రౌపది లో ఆయనేమి వ్రాశాడో, ముందుమాటలోనే చెప్పాడట! ఇష్టం వుంటే చదవండి, లేకపోతే లేదు--ఇంత రాధ్ధాంతం యెందుకు?  


ఇక టీవీ విషయానికొస్తే, వాళ్ళకి యే విషయాన్నైనా, యెప్పుడైనా చూపించే హక్కు వుంది, వుండాలి! చూస్తారోలేదో, చూపిస్తారోలేదో, మీ యిష్టం!  


ఎక్సైలెడ్ బ్లాగో, వెబ్ సైటో తెలియదు గానీ, వాడేదో యెప్పుడో వ్రాశాడట--దాన్ని తమ యిష్టం వచ్చినప్పుడు ఫలానా ఫలానా చానెళ్ళు చూపించాయట!  


చూసినవాళ్ళో, అది ప్లాన్ చేసినవాళ్ళో విధ్వంసం మొదలెడితే, అది టీవీవాళ్ళదీ, ఆ విలేఖరులదీనా ఆ తప్పు?  


పోలీసుల్నీ, కోర్టులనీ కూడా తప్పుదారి పట్టిస్తున్నారు ఈ రాజకీయులు!  


ప్రతీ టీవీకీ 'చానెల్ లాక్'; చైల్డ్ లాక్' ఇలాంటివి వున్నాయి! మరి యెవరు యేమి చూడాలి, చూడకూడదు అనే విషయం ప్రభుత్వాలకి యెందుకు?  


ఈ విషయం లో గొల్లపూడివారు దాదాపు 20 యేళ్ళ క్రితమే యేమి వ్రాశారో చదివారా? లేకపోతే చదవండి--


http://gollapoodi.blogspot.com/2009/11/blog-post_25.htmlhttp://gollapoodi.blogspot.com/2009/11/blog-post_25.html


తరవాత, 'సెన్షేషనలిజం' అని ఒక మాటని మీడియాకి అన్వయించడం మొదలెట్టారు!  


ఈ టాపిక్ మీద ప్రపంచ వ్యాప్తం గా అనేక భాషల్లో అనేక నవలలు వచ్చాయి--ఇంగ్లీషులో ఆర్థర్ హెయిలీ 'ది ఈవెనింగ్ న్యూస్' చదవండి చాలు!  


'బేసిక్' గా, 'ఫండమెంటల్'గా ప్రింటు గానీ, ఎలెక్ట్రానిక్ గానీ, యే మీడియా అయినా ఫక్తు 'వ్యాపార సంస్థలు!' 


మరి అవి తమ చదువరులనీ, ప్రేక్షకుల్నీ సంఖ్య పెంచుకోడానికి యే పంథా అనుసరించినా, వాళ్ళిష్టం--మనం వద్దన్నా మానతారా? నష్టాలని చవిచూసి యెత్తేస్తారా? అలా యెత్తేస్తే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలేమయిపోతాయి?  


ఇవన్నీ నిజాలు--ఈ రాజకీయులు మాట్లాడేవే--పచ్చి అబధ్ధాలు!  


యే ప్రభుత్వమూ, యెవరి వాక్ స్వాతంత్ర్యాన్నీ నియంత్రించడానికి ప్రయత్నాలు చెయ్యడానికి వీల్లేదు! 


అదంతే!


ఇంకొక చిన్నమాట!  


"నీ చేతికఱ్ఱని నీ యిష్టం వచ్చినట్టు వూపుకునే హక్కు నీకుంది--అది యెదటివాడి ముక్కుకి తగలనంతవరకూ!"  


(అంటే ముక్కుకితప్ప ఇంకెక్కడ తగిలినా ఫరవాలేదు అనా?)  


ఆలోచించండి!

Thursday, January 7, 2010

బ్యూరాక్రసీ




మందమైన చర్మం


మనదేశం లో అతి మందమైన చర్మం గల ఆర్గనైజేషన్ లు యేవి అని అడిగితే, మీకు గుర్తొచ్చేవి యేమిటి?  


నాకు మాత్రం మొట్టమొదట గుర్తొచ్చేది 'జీవన్ బీమా నిగం' అనే ఎల్ ఐ సీ, తరవాత--మన బీ ఎస్ ఎన్ ఎల్!  


యెందుకంటారా?  


మళ్ళీ వ్రాస్తాను.

Thursday, December 17, 2009

ద్రవ్యోల్బణం


"స్వాప్" లు

ఈ మధ్య జింబాబ్వే లో ద్రవ్యోల్బణం వల్ల--వీధి చివర కొట్లో బటాణీలు కొనుక్కోడానికి, తన రెండుచేతులనిండా తన గడ్డం యెత్తువరకూ--తాను మోయలేకపోతున్నన్ని డబ్బుల కట్టల్ని మోసుకొంటూ వెళుతున్న యేడెనిమిదేళ్ళ పిల్ల ఫోటోలు, వాళ్ళ 50 మిలియన్ డాలర్ల నోటు--ఇలా కొన్ని ఫోటోలు అంతర్జాలం లో ఈమెయిళ్ళలో ప్రయాణించాయి--మీరు చూసే వుంటారు.  


మరి అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం యేమి చేస్తోంది?  


కొన్ని పెద్ద దేశాలు--ఐక్యరాజ్య సమితి ఆదేశాలవల్లో, ప్రపంచ బ్యాంకు చెప్పినందువల్లో, అలాంటి దేశాలకి కొన్ని కోట్ల డాలర్లు ఋణాలు మంజూరు చేశాయి అనుకుందాం. అలా చాలా చిన్న దేశాలకి అప్పులిచ్చారనుకుందాం.  


ద్రవ్యోల్బణం వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల, ఇక ఈ జన్మలో అలాంటి ఋణాలు వసూలు అవవు అని ఓ నిశ్చయానికి వచ్చేస్తాయి ఆ పెద్ద దేశాలు!  


అప్పుడు ఓ అంతర్జాతీయ సంస్థ ఓ పెద్ద దేశపు ప్రభుత్వాన్ని సంప్రదించి, 'మీరు ఫలానా ఫలానా దేశాలకి ఇచ్చిన అప్పులు వసూలవవు అని నిశ్చయించుకున్నారుకదా, వాటిని మాకు అమ్మెయ్యండి--ఒక డాలరుకి మీకు 15 సెంట్లు మా సంస్థ చెల్లిస్తుంది ' అని బేరం పెడతారు.  


ఆ దేశం, చచ్చినవాడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకొని, వాళ్ళతో ఒప్పందానికి వచ్చేస్తుంది!  


అప్పుడు ఆ సంస్థ, ఆయా పేద దేశాల దగ్గరకి వెళ్ళి, మీ అప్పులు మొత్తం వసూలు చేసుకొనే హక్కులు మాకు వచ్చాయి, మీరుగనక డాలరుకి 25 సెంట్లు మాకు చెల్లిస్తే, ఆ ఋణాలన్నీ రద్దు చేసేస్తాం--కానీ--దీనికి ప్రతిగా--మీ బీచిలదగ్గరా, కొండలదగ్గరా, అడవుల్లోనూ--ఇన్ని వేల యెకరాలు మాకు రాసివ్వాలి' అని బేరం పెడతాయి. (సహజం గా ఆ భూములు టూరిస్టు స్పాట్ లో, గనులో, బోళ్ళు కలపా, ఇతర వాణిజ్యపరమైన వుత్పత్తులు యెక్కువగా జరగడానికి అనువైన స్థలాలో అయి వుంటాయి!) (ఇలాంటి బేరాలకోసం ఆ ప్రభుత్వం లో ఓ ప్రముఖ మంత్రినో, రాజుగారి అల్లుణ్ణో, సక్రమ/అక్రమ సంతానాల్లో ఒకణ్ణో పట్టుకొని, ఓ పెద్దమొత్తం లంచం ఇస్తారు!)  


ఇలాంటి వొప్పందాలవల్ల, కొన్ని కోట్ల విలువైన భూములు దక్కడమే కాకుండా, వీళ్ళ దగ్గర వసూలు చేసే దానికి, వాళ్ళకి చెల్లించేదానికీ తేడా--డాలరుకి 10 సెంట్లు--కూడా వాళ్ళకి లాభమే!  


ఇలాంటివాటిని "ఈక్విటీ-డెట్ స్వాప్" లు అంటారు.  


మన గాలి, జగన్లు ఇంకా ఇలాంటివి ప్రయత్నించినట్టులేదు! (మనీలాండరింగ్ తో సరిపెట్టారు!)  


ఆ దేశాలు అదృష్టవంతులు!